టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా సెట్లో జరిగిన ప్రమాదంతో విష్ణు గాయపడ్డారు. డ్రోన్ కెమెరా దూసుకొచ్చి తనపై పడటంతో చేతికి గాయాలైనట్టు సినీవర్గాలు తెలిపాయి. దాంతో చిత్రీకరణని నిలిపివేశారు. డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ కోసం మంచు విష్ణు కొంతకాలం కిందటే న్యూజిలాండ్‌కి వెళ్లాడు. అక్కడ పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లిన విష్ణు.. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. భక్త కన్నప్ప కథతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నారు.
333
previous post