సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరుకారం. ఈ సినిమాకు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు పెద్ద టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే, యూనిట్ కు ఇదో పెద్ద షాక్ కిందే లెక్క. ఎఁదుకంటే, ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్-లక్ష్మణ్ కు మించిన ఫైట్ మాస్టర్లు లేరు. మరీ ముఖ్యంగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి వీళ్లు ఆల్రెడీ వర్క్ చేశారు. టీజర్ లో చూసిన ఫైట్ ను కంపోజ్ చేసింది వీళ్లే. ఇలాంటి స్టార్ ఫైట్ మాస్టర్లను తప్పించడం వెనక రీజన్ ఏంటనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.
మహేష్ బాబు మూవీ నుంచి ఇలా కొందర్ని తప్పిస్తున్నారనే వార్తలు కొత్తేం కాదు. మొన్నటికిమొన్న గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజాహెగ్డే ను సైడ్ చేశారు. ఆ తర్వాత తమన్ ను కూడా తప్పిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు రామ్-లక్ష్మణ్ మాస్టర్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ సినిమా షూట్ ను పక్కనపెట్టి విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్. తాజాగా ఆయన తిరిగొచ్చాడు. 16వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందంట. అంతలోనే ఈ పుకారు చాలామందిని కలవరపెడుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే, మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
హారిక-హాసిని బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది, సెకెండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ సంక్రాంతి నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.