తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలవుతుందని తెలిపింది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, నవంబరు 13న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల లెక్కింపు , ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది.
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17వ తేదీల్లో; మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన, మిజోరంలో నవంబర్ 7న, రాజస్థాన్ నవంబర్ 23న ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీనే అన్ని రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు జరుగుతుంది.
కాగా, తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా, మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో భారాస, మధ్యప్రదేశ్‌లో భాజపా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది.