370
స్టార్ హీరో సూర్యకు ‘కంగువా’ షూటింగ్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, పది అడుగుల ఎత్తులో ఉన్న రోప్ తెగి అందులో ఉన్న కెమెరా ఆయనపై పడింది. దీంతో భుజానికి చిన్నపాటి గాయమైంది. ఆ వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే తాజాగా తన గాయంపై సూర్య స్పందించాడు. ”ప్రస్తుతం బాగానే ఉన్నా. ప్రమాదం జరిగిందని తెలిసి కోలుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నారు. మీ అందరి ప్రేమకు రుణపడి ఉంటా” అని సూర్య ట్విటర్లో పోస్ట్ చేశాడు. శివ దర్శకత్వంలో సూర్య ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘కంగువా’. పీరియాడికల్ డ్రామాగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాను 38 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ అందుబాటులోకి రానుంది.