407
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-1తో రోహిత్‌సేననే కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72), వార్నర్ (56) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లి (56), శ్రేయస్ అయ్యర్ (48) పోరాడారు. మాక్స్‌వెల్ నాలుగు వికెట్లు,హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.