312
హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త దశను ప్రారంభించింది. ఆమె రెండో వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, రిసార్ట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు కొచ్చిలోని ఓ హోటల్ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను జగత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకుముందు ఆమె దర్శకుడు విజయ్‌ను పెళ్లాడింది. అయితే ఆ రెండు కుటుంబాలకు పడలేదు. విజయ్ కుటుంబంతో పొసగక, ఆ తర్వాత విజయ్ తో కూడా అభిప్రాయబేధాలొచ్చి అమలాపాల్ బయటకొచ్చేసింది. అలా పెళ్లయిన మూడేళ్లకే విజయ్‌కు దూరమైంది. అయితే కొన్నాళ్ల నుంచి అమలా పాల్, జగత్ దేశాయ్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక ఈ హీరోయిన్ పుట్టిన రోజున జగత్ ప్రపోజ్ కూడా చేశాడు. కాగా, అమలాపాల్ రెండో వివాహానికి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.