Politics
Home » AP Politics : చంద్రబాబును ఎవరూ పొగడకూడదా ? రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ దాడి వెనుక వ్యూహం ఏమిటి ?

AP Politics : చంద్రబాబును ఎవరూ పొగడకూడదా ? రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ దాడి వెనుక వ్యూహం ఏమిటి ?

by admin
0 comment

AP Politics :   సూపర్ స్టార్ రజనీకాంత్  ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు విజన్‌ను పొగిడారు. 2024 సీఎం అయితే ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పారు. రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే  వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ ఎందుకు రజనీకాంత్ విషయంలో దూకుడుగా ఉంది. తమను విమర్శించకపోయినా ప్రత్యర్థిని పొగడటాన్ని కూడా సహించలేకపోతున్నారా? రజనీ కాంత్‌నే వదల్లేదు.. ఇంకెవరు చంద్రబాబును టీడీపీని పొగిడినా అదే ఎదురుదాడి ఖాయమని సంకేతాలు పంపాలనుకున్నారా?

తమ జోలికి రాని వారి జోలికి వెళ్లవు రాజకీయ పార్టీలు ! 

సహజంగా రాజకీయాల్లో కనిపించని ఓ కట్టు బాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా తమను విమర్శిస్తేనే తిరిగి విమర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధంలేనివారు. సెలబ్రిటీలు అయినా మరొకరు అయినా  తమకు ఉన్న వ్యక్తిగత అనుబంధాల రీత్యా.. ఏదైనా పార్టీని సపోర్ట్ చేస్తే..  ఇతర రాజకీయ పార్టీలు పట్టించుకోవు. కానీ వారు తమ మిత్రుల్ని పొగుడుకోకుండా. తమను విమర్శిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి .  తమ ప్రత్యర్థిని పొగిడేసి  వెళ్లిపోతే పట్టించుకోవరు. కానీ రజనీకాంత్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ శతజయంతి కోసం వచ్చిన రజనీకాంత్..  ఏపీలో పరిస్థితులపై ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క విమర్శ కూడా చేయలేదు. 

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links